హఫీజ్‌పేట్ స్టేషన్ వద్ద మహిళపై దాడి వీడియో వైరల్ అయ్యింది. దాడి చేసింది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాదని రైల్వే వివరణనిచ్చింది. తెలంగాణ హోంగార్డుగా గుర్తించి, అతని డిప్యుటేషన్ రద్దు చేశారు. చట్టపరమైన చర్యలకై తెలంగాణ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. Hafeezpet Railway Station | హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒక మహిళపై అమానుషంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి మహిళను విచక్షణారహితంగా కొడుతూ, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇది చూసిన నెటిజన్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ అమానుష దాడి చేసిన వ్యక్తి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాదు అని దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ ఇచ్చింది. మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీస్ సిబ్బంది హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ కానిస్టేబుల్ మహిళతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా మహిళపై దాడిచేసి, జుట్టు పట్టి బాధితురాలిని ఈడ్చుకెళ్లాడు. మరో వ్యక్తి వచ్చి సిబ్బందిని అడ్డుకుని ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించాడు, అతడికి కనీసం మానవత్వం లేదా ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వీడియో తమ దృష్టికి రావడంతో దక్షిణ మధ్య రైల్వే వెంటనే అంతర్గత విచారణ చేపట్టింది. విచారణ అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై క్లారిటీ ఇచ్చింది. బాధితురాల పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాదని, తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన హోంగార్డు అని తెలిపింది. విధుల్లో భాగంగా సదరు హోంగార్డును తెలంగాణ పోలీస్ శాఖ నుండి రైల్వే స్టేషన్‌కు డిప్యుటేషన్‌పై పంపినట్లు వెల్లడించింది. మహిళపై దాడి ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత, ఆ హోంగార్డును వెంటనే డిప్యుటేషన్ రద్దు చేసి తిరిగి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు పంపించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అతడిపై చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ పోలీస్ విభాగానికి అప్పగించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలతో దక్షిణ మధ్య రైల్వే వివరణ ఇచ్చింది. Frequently Asked Questions హఫీజ్‌పేట్‌లో జరిగిన ఘటన ఏమిటి? హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒక వ్యక్తి మహిళను కొట్టి, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదట ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అని నెటిజన్లు భావించినా, దక్షిణ మధ్య రైల్వే అతను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాదని స్పష్టం చేసింది. అతను తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన హోంగార్డు. హోంగార్డు డిప్యుటేషన్ రద్దు చేసి, తిరిగి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు పంపించారు. అతనిపై చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ కోరింది. జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ త