Kaizer News

నేడు గండిమైసమ్మలో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశ

నేడు గండిమైసమ్మలో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం

· City - Hyderabad · ntnews.com

కుత్బుల్లాపూర్‌, ఆగస్టు 30: కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగట్టేందుకు సెప్టెంబర్‌ 1 నుంచి చేపడుతున్న నిరసన కార్యక్రమాల రూపకల్పనకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఉదయం 10.30 గంటలకు గండిమైసమ్మలోని మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి హాజరుకానున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News