Kaizer News

ఆగని కన్నీటి వరద

ఆగని కన్నీటి వరద

· National - India · sakshi.com

ఇప్పటివరకు 9,435 మందిని రక్షించామన్న అధికారులు కఠ్మాండు: నేపాల్‌లో ప్రజల్లో కన్నీటి వరద కొనసాగుతూనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఆదివారం 794కి చేరుకుంది. ఇంకా 2,500 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆకస్మిక వరదల ధాటికి గల్లంతైన వారి కోసం వరుసగా ఐదో రోజు గాలింపు చర్యలు కొనసాగించారు. సహాయక బృందాలు కాలంతో పోటీ పడుతూ ముమ్మరంగా పని చేస్తున్నాయి. భీకర వరదల కారణంగా ప్రభావితమైన ఎనిమిది జిల్లాల్లో ఇప్పటిదాకా 794 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు. ఆగస్ట్‌ 26వ తేదీన నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు సమీపంలో హిమానీనదం కూలిపోవడంతో సంభవించిన వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు పట్టణాలు, గ్రామాలను తుడిచిపెట్టేశాయి. కీలకమైన మౌలిక సదుపాయాలను దారుణంగా దెబ్బతిన్నాయి. జలవిద్యుత్‌ కేంద్రాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు 9,435 మందిని రక్షించామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో 2,502 మంది జాడ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. మూడు జిల్లాల్లో 238 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు కనిపించకుండా పోయారని నేపాల్‌ విద్యాశాఖ ప్రకటించింది. గల్లంతైన వారిలో 320 మంది విదేశీయులు ఉన్నారు. అదృశ్యమైన తమ బంధువుల కోసం ప్రజలు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. అయితే, ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలలో 17 మాత్రమే గుర్తించగలిగారని పోలీసులు తెలిపారు. అనేక మృతదేహాలు చాలావరకు కుళ్లిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఇప్పటివరకు 96 మృతదేహాలను ఖననం చేశారు. సహాయక శిబిరాల్లో సమస్యలు తీవ్రం నేపాల్‌లో అత్యవసర పరిస్థితి ఇంకా ముగియలేదు. బాధితులు తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. రసువాలో 3, నువాకోట్‌లో 15 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన సుమారు 3,500 మందికి పాఠశాలలు, ప్రభుత్వ, సామాజిక భవనాలలో తాత్కాలిక వసతి కల్పించారు. గర్భిణులు, బాలింతలు, వైద్య సంరక్షణ అవసరమైన వారితో సహా వృద్ధులు, చిన్నారులకు ఈ శిబిరాల్లో ఆశ్రయం కలి్పస్తున్నారు. అయితే ఈ శిబిరాల్లో తాగునీరు, పారిశుధ్య సదుపాయాల కొరత వేధిస్తోంది. ఇక్కడ జనం కిక్కిరిసిపోయి ఉండడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. పలు స్వచ్ఛంద సంస్థలు, బౌద్ధ మత సంస్థలు బాధితులకు సేవలందిస్తున్నాయి. సొరంగంలో కా ర్మీకుల కోసం గాలింపు వరద ప్రభావిత నువాకోట్‌లోని ఎగువ త్రిశూలి–3ఏ జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్‌ సైనిక ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాసువా, నువాకోట్‌ జిల్లాల్లోని తొమ్మిది జలవిద్యుత్‌ ప్రాజెక్టుల వద్ద 537 మంది కా ర్మీకులు, ఉద్యోగుల ఆచూకీ తెలియకుండా పోయింది. త్రిశూలి–3ఏ జలవిద్యుత్‌ ప్రాజెక్టు సొరంగం వీటిలో ఒకటి. ఈ సొరంగంలో 42 మంది చిక్కుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. వీరంతా భూగర్భ పవర్‌హౌస్‌ మరమ్మతు పనుల్లో ఉండగా ఒక్కసారిగా వరద ముంచెత్తించింది. వారిని కాపాడేందుకు ప్రభుత్వం 90 మంది సభ్యుల సహాయక బృందాన్ని రంగంలోకి దించింది. సమయస్ఫూర్తి ప్రదర్శించి, పిల్లల ప్

Original source: sakshi.com
Read more on Kaizer News