Kaizer News

డిగ్రీతో పాటు విలువలు..

డిగ్రీతో పాటు విలువలు..

· City - Hyderabad · prabhanews.com

సమాజం పట్ల బాధ్యత ఉండాలి విద్యార్థులకు రాష్ట్ర భద్రతా సలహాదారు శివధర్‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : డిగ్రీలు ఉద్యోగాలు సాధించడమే విద్యార్థుల అంతిమ లక్ష్యం కాకూడదని జ్ఞానం సాంకేతిక నైపుణ్యాలతో పాటు క్రమశిక్షణ నైతిక విలువలు సామాజిక బాధ్యతలను జీవితంలో భాగంగా చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ భద్రతా సలహాదారు విశ్రాంత ఐపీఎస్‌ బత్తుల శివధర్‌రెడ్డి సూచించారు. వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ఒకసారి నేర్చుకున్న విద్యతోనే సరిపెట్టుకోకుండా నిరంతరం కొత్త అంశాలను అధ్యయనం చేస్తూ తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నగర శివార్లలోని హోలీ మేరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో శనివారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్‌ డే 2026 కార్యక్రమానికి శివధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని వృత్తి జీవితంలోకి అడుగుపెడుతున్న తరుణంలో విద్యార్థులు తమ వ్యక్తిగత అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. మారుతున్న సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శివధర్‌రెడ్డి సూచించారు. విద్యను కేవలం ఉద్యోగం పొందేందుకు ఉపయోగించే సాధనంగా చూడకుండా సమాజంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ బాధ్యత కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. అందువల్ల వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు నైతిక విలువలకు విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తమ వృత్తిలో ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజం పట్ల బాధ్యతను విస్మరించరాదని పేర్కొన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న సెంచూరియన్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ డాక్టర్‌ జె.ఎం. రావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యాసంస్థల్లో పొందిన జ్ఞానాన్ని వాస్తవ జీవిత సమస్యల పరిష్కారానికి వినియోగించాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యాలతో పాటు సృజనాత్మకత ఆవిష్కరణ నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. పరిశ్రమ అవసరాలు నిరంతరం మారుతున్నందున ఉద్యోగ జీవితంలో కూడా నేర్చుకోవడం కొనసాగించాలని సూచించారు. గ్రాడ్యుయేషన్‌ డే సందర్భంగా 621 మంది విద్యార్థుల్లో 445 మంది తమ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ తెలిపారు. వీరిలో 91 మంది ఫస్ట్‌ క్లాస్‌ విత్‌ డిస్టింక్షన్‌ 297 మంది ఫస్ట్‌ క్లాస్‌ 57 మంది సెకండ్‌ క్లాస్‌ సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు వెండి పతకాలను అందజేశారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన అనెమోని అఖిల 9.17 సీజీపీఏతో కళాశాల టాపర్‌గా నిలిచి బంగారు పతకం సాధించారు. 2025–26 విద్యా సంవత్సరంలో కళాశాల 74 శాతం ఉత్తీర్ణత సాధించిందని ప్రిన్సిపాల్‌ తెలిపారు. గేట్‌ క్యాట్‌ జీఆర్‌ఈ పరీక్షల్లో 100 మంది విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు. క్యాంపస్‌ ఉద్యోగ నియామకాల్లో సుమారు 50 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా అత్యధికంగా రూ.19 లక్షల వార్షిక

Original source: prabhanews.com
Read more on Kaizer News