Kaizer News

IND vs NZ: చూశావా గంభీర్ జీ.. రోహిత్, కోహ్లీ క్రేజ

IND vs NZ: చూశావా గంభీర్ జీ.. రోహిత్, కోహ్లీ క్రేజ్‌తో క్షణాల్లోనే టిక్కెట్లన్నీ సేల్..!

· National - India · tv9telugu.com

టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు ఇప్పటినుంచే అంచనాలకు మించి క్రేజ్ కనిపిస్తోంది. న్యూజిలాండ్ క్రికెట్ అంతర్జాతీయ సీజన్ టికెట్ విక్రయాలు రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. క్రికెట్ నేషన్ సభ్యుల ప్రీ-సేల్ మొదలైన 48 గంటల్లోనే 26,000 టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం. భారత్ అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ సుదీర్ఘ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భాగంగా టీ20లు, వన్డేలు, టెస్టులు సహా మొత్తం 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగే పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు, అలాగే క్రైస్ట్‌చర్చ్‌లోని 9,000 సీట్ల హగ్లీ ఓవల్‌కు టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అక్టోబర్ 22, 24 తేదీల్లో జరిగే తొలి రెండు టీ20లకు ఈ స్టేడియం పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే రెండో టెస్టుకు కూడా అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. వెల్లింగ్టన్, బేసిన్ రిజర్వ్, HnRY స్టేడియంలలో జరిగే మ్యాచ్‌లకు కూడా టిక్కెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కువమంది చదివినది: రాసిపెట్టుకోండి.. అలాంటోడు దొరకడం టీమిండియా అదృష్టం.. వదిలేశారో..! న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ గ్లెన్ క్లిచ్‌లీ మాట్లాడుతూ, భారత పర్యటనపై అభిమానుల్లో ఉన్న ఉత్సాహమే రికార్డు విక్రయాలకు కారణమని తెలిపారు. క్రికెట్ నేషన్ కోడ్‌తో ఒక్కో టిక్కెట్ ధర 30 న్యూజిలాండ్ డాలర్ల లోపే ఉంటుందని, సెప్టెంబర్ 7 నుంచి సాధారణ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. AFG vs IND: ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే.. ఆఫ్టాన్‌ను ఢీ కొట్టే భారత జట్టు ఇదే..? మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Original source: tv9telugu.com
Read more on Kaizer News