Kaizer News

మోదీ ప్రసంగంపైనే అందరి కళ్లు! మధ్య ఆసియా గడ్డపై అడ

మోదీ ప్రసంగంపైనే అందరి కళ్లు! మధ్య ఆసియా గడ్డపై అడుగుపెట్టిన మోదీ..

· National - India · telugu.oneindia.com

భారత వ్యూహాత్మక ప్రాభవాన్ని, ప్రాంతీయ పట్టును ప్రపంచ వేదికపై సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మరో చారిత్రాత్మక పర్యటనకు శ్రీకారం చుట్టారు. మధ్య ఆసియాలో భారత్‌కు అత్యంత కీలకమైన ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ దేశాలలో నాలుగు రోజుల పాటు ఈ ద్వైపాక్షిక, బహుపాక్షిక దౌత్య పర్యటన సాగనుంది. సెంట్రల్ ఆసియాతో ఉన్న శతాబ్దాలనాటి నాగరికతా సంబంధాలను నెమరువేస్తూనే, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, డిజిటల్ నెట్‌వర్కింగ్ రంగాల్లో సరికొత్త రికార్డులను సృష్టించడమే లక్ష్యంగా ప్రధాని ఈ టూర్ ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలి విడతగా ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో ల్యాండ్ అయ్యారు. అధ్యక్షుడు షావ్‌కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు సాగుతున్న ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. భారత్ నిర్దేశించుకున్న 'వికసిత్ భారత్' లక్ష్యానికి, ఉజ్బెకిస్తాన్ ప్రణాళికలకు సమన్వయం కుదురుస్తూ వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, విద్యుత్ రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశముంది. తాష్కెంట్‌లో భారత చారిత్రక మూలాలను ప్రతిబింబించే లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్‌తో పాటు మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా మోదీ సందర్శించనున్నారు. SCO సదస్సుకు ప్రధాని మోదీ.. పుతిన్ తో కీలక భేటీ.. బిష్కెక్‌లో ఎస్‌సీఓ రజతోత్సవ సమరం ఉజ్బెకిస్తాన్ పర్యటన ముగించుకుని, అధ్యక్షుడు సాదిర్ జపరోవ్ పిలుపు మేరకు కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌కు ప్రధాని వెళతారు. అక్కడ జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఎస్‌సీఓ ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న ఈ సందర్భంలో భద్రత, ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక అవకాశాలు ప్రధాన ఎజెండాగా భారత్ తన గళాన్ని వినిపించనుంది. ప్రాంతీయ శాంతికి ముప్పుగా మారిన ఉగ్రవాదం, తీవ్రవాదంపై నిర్దాక్షిణ్యంగా పోరాడాలని మోదీ ఈ వేదికగా ప్రపంచ దేశాలకు పిలుపునివ్వనున్నారు. మోదీకి వీడ్కోలు పలికిన మూగజీవాలు.. ఆసియా సంస్కృతికి భరోసా దౌత్యపరమైన చర్చలతో పాటు మధ్య ఆసియా సంస్కృతికి అద్దం పట్టే '6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్' ప్రారంభోత్సవంలోనూ ప్రధాని భాగస్వామి కానున్నారు. ప్రపంచ జనాభాలో 3.4 బిలియన్ల ప్రజలకు, అంతర్జాతీయ వాణిజ్యంలో 15 శాతానికి ప్రతినిధిగా ఉన్న ఎస్‌సీఓ కూటమిలో 2017 నుంచి భారత్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ నాలుగు రోజుల పర్యటనతో సెంట్రల్ ఆసియా ప్రాంతంలో భారత్ తన ప్రాభవాన్ని, భద్రతా సంబంధాలను పటిష్టం చేసుకుంటూ శాంతి, సమృద్ధి దిశగా బలమైన అడుగులు వేయనుంది

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News