Kaizer News

Nacharam: వేడుకల్లో రోడ్డు భద్రతా నిబంధనలు పాటించా

Nacharam: వేడుకల్లో రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి: అదనపు డీసీపీ!

· City - Hyderabad · hmtvlive.com

Shorts నాచారం: గణేష్ ఉత్సవాల సందర్భంగా “గణేష్ సురక్ష సంకల్ప్–2026”లో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో “మెరుగైన భవిష్యత్తు కోసం సంకల్పం–Arrive Alive” కార్యక్రమాన్ని నిర్వహించారు. నాచారం పీఎస్ పరిధిలో బాబానగర్‌లో గణేష్ మండపం నిర్వాహకుడు దేవా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అదనపు డీసీపీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఐ ధనుంజయ, ఎస్‌ఐలు భాస్కర్, గోవర్ధన్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవ నిర్వాహకులు, యువత, స్థానికులతో అధికారులు మాట్లాడి రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వేగాన్ని నియంత్రించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని అధికారులు కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News