భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల మధ్య ఆసియా పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్‌లలో పర్యటిస్తున్నారు. పర్యటనలో తొలి దశగా శనివారం (ఆగస్టు 29) తాష్కెంట్ చేరుకున్న మోదీకి ఉజ్బెక్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, విద్యతో పాటు కీలక ఖనిజ వనరులపై చర్చలు జరుపుతారు. తాష్కెంట్‌లోని భారతీయ సమాజం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికింది. భారతీయుల ప్రదర్శించిన కథక్, అండిజాన్ పోల్కా నృత్యాలతో పాటు ఉజ్బెక్ చిన్నారులు భారతీయ గీతానికి చేసిన నృత్యాన్ని మోదీ వీక్షించారు. తబలాతో పాటు సాంప్రదాయ ఉజ్బెక్ వాయిద్యాలైన డోయిరా, చాంగ్‌ల ఆకర్షణీయమైన సమ్మేళనాన్ని కూడా వీక్షించారు. అనంతరం అధ్యక్షుడు మిర్జియోయెవ్‌తో కలిసి యాంగీ ఉజ్బెకిస్తాన్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ పర్యటన సందర్భంగా, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని మోదీ, అధ్యక్షుడు షవ్‌కత్ మీర్జియోయెవ్‌తో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరపనున్నారు. తాష్కెంట్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అధ్యక్షుడు మీర్జియోయెవ్ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి. ప్రధానమంత్రి పర్యటనలో సహజ వనరులు ఎందుకు కీలక అంశంగా మారాయంటే.. ఉజ్బెకిస్తాన్‌లో అపారమైన ఇంధన, ఖనిజ సంపద ఉంది. ముఖ్యంగా యురేనియం ఈ దేశానికి వ్యూహాత్మక ఆస్తిగా మారింది. నవోయి, మధ్య కిజిల్‌కుమ్ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ యురేనియం ఉత్పత్తిదారుల్లో ఉజ్బెకిస్తాన్ ఒకటి. యురేనియం అణు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన ముడి పదార్థం. ప్రపంచ దేశాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన భద్రత కోసం అణుశక్తిపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో యురేనియం ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. భారత్ కూడా అణు విద్యుత్ సామర్థ్యాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నందున.. ఈ రంగంలో ఉజ్బెకిస్తాన్‌తో సహకారం వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. యురేనియం వెలికితీతలో ఉజ్బెకిస్తాన్ ఇన్-సిటు రికవరీ పద్ధతిని విస్తృతంగా ఉపయోగిస్తోంది. భారీ స్థాయిలో భూమిని తవ్వకుండానే భూగర్భంలోకి ద్రావణాన్ని పంపించి ఖనిజాన్ని వెలికితీసే ఈ విధానం సంప్రదాయ తవ్వకాలతో పోలిస్తే భూమిపై తక్కువ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఉజ్బెకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో సహజ వాయువు మరో కీలక వనరు. విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, గృహ అవసరాలకు గ్యాస్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే ముడి గ్యాస్‌ను కేవలం ఎగుమతి చేయడం కంటే.. దాన్ని దేశీయంగా వినియోగించి పెట్రోకెమికల్, అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేయాలనే దిశగా ఉజ్బెకిస్తాన్ ముందుకు సాగుతోంది. చమురు నిల్వలు కూడా ఉన్నప్పటికీ.. గ్యాస్‌తో పోలిస్తే చమురు రంగం పరిమితంగానే ఉంది. పాత క్షేత్రాల్లో ఉత్పత్తి తగ్గడం, కొత్త అన్వేషణకు భారీ పెట్టుబడులు అవసరం కావడం ఈ రంగానికి సవాళ్లుగా ఉన్నాయి. ఉజ్బెకిస్త