వావ్రె (బెల్జియం): పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో జర్మనీ జట్టు నాలుగోసారి విజేతగా నిలిచింది. స్పెయిన్ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ 1–0 గోల్ తేడాతో గెలిచింది. జర్మనీ తరఫున మైకేల్ స్ట్రుతాఫ్ 44వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. ఈ విజయంతో ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు గెల్చుకున్న జట్టుగా పాకిస్తాన్ (1971, 1978, 1982, 1994) పేరిట ఉన్న రికార్డును జర్మనీ (2002, 2006, 2023, 2026) సమం చేసింది. తుది పోరులో స్పెయిన్ జట్టు తమకు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకొని ఈ మెగా టోర్నీలో మూడోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. 1971, 1998లోనూ స్పెయిన్ జట్టు ఫైనల్లో ఓడిపోయింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. 248 ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్. ఇందులో 136 ఫీల్డ్ గోల్స్. 97 గోల్స్ పెనాల్టీ కార్నర్‌ల ద్వారా... 15 గోల్స్ పెనాల్టీ స్ట్రోక్‌ల ద్వారా వచ్చాయి. 16 జట్ల మధ్య మొత్తం 50 మ్యాచ్‌లు జరిగాయి. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు