Kaizer News

భారీ వర్షాలతో గంగమ్మ ఉగ్రరూపం.. రిషికేశ్ ఘాట్ల వద్

భారీ వర్షాలతో గంగమ్మ ఉగ్రరూపం.. రిషికేశ్ ఘాట్ల వద్ద అప్రమత్తం

· National - India · prabhanews.com

నీటి మట్టం పెరిగినా హెచ్చరిక స్థాయికి దిగువనే.. ఘాట్ల వద్ద ఎస్‌డీఆర్‌ఎఫ్, జల పోలీసులు మోహరింపు ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ కొండ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రిషికేశ్‌లో గంగానది నీటి మట్టం పెరుగుతోంది. అయితే ప్రస్తుతం నది నీటి మట్టం హెచ్చరిక స్థాయికి దిగువనే ఉందని అధికారులు తెలిపారు. త్రివేణి ఘాట్ వద్ద గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని కేంద్ర జల సంఘం అధికారులు వెల్లడించారు. నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో రిషికేశ్, ముని కీ రేతి, లక్ష్మణ్‌ఝూలాలోని ప్రధాన ఘాట్ల వద్ద రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జల పోలీసులు, విపత్తు సహాయక బృందాలను మోహరించారు. ఘాట్ల వద్ద భక్తులు, పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని లౌడ్‌స్పీకర్ల ద్వారా నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం గంగానది నీటి మట్టం హెచ్చరిక స్థాయి కంటే చాలా దిగువన ఉన్నప్పటికీ కొండ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగినా, తెహ్రీ డ్యామ్ లేదా శ్రీనగర్ నుంచి నీటిని విడుదల చేసినా పరిస్థితి మారే అవకాశం ఉందని జల పోలీసు అధికారులు తెలిపారు. ఘాట్ల వద్ద తమ సిబ్బంది 24 గంటలూ నిఘా కొనసాగిస్తున్నారని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మాయకుండ్, చంద్రభాగా వంటి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను కూడా నిరంతరం అప్రమత్తం చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు భారీ వర్షాలు మధ్యప్రదేశ్‌లోని సత్నా, చిత్రకూట్ ప్రాంతాల్లో వరద పరిస్థితులకు దారితీశాయి. మండాకిని నది ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. పరిస్థితిని పరిశీలించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వరద బాధితులను కలుసుకుని అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదని తెలిపారు. సత్నా జిల్లాలో కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, దీంతో జిల్లాలోని నదులు, వాగులు ఉప్పొంగాయని కలెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. చిత్రకూట్‌లో మండాకిని నది నీటి మట్టం గరిష్ఠ వరద స్థాయిని సుమారు ఆరు మీటర్ల మేర దాటిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నప్పటికీ కొన్ని ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 700 మందికిపైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, సహాయక చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వైమానిక సహాయాన్ని కూడా వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన ఆకస్మిక వరదలతో నేపాల్ తీవ్రంగా నష్టపోయింది. అక్కడ వరద మృతుల సంఖ్య 734కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్‌ఏ నమూనాల విశ్లేషణలో సహకరించేందుకు భారత్ ప్రత్యేక ఫోరెన్సిక్ బృందాన్ని నేపాల్‌కు పంపింది. అస్సాంలోనూ ఇటీవల వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తి ఇళ్లు, వ్యవసాయ భూములు, పశుసంపదకు నష్టం కలిగించాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో భ

Original source: prabhanews.com
Read more on Kaizer News