Kaizer News

నేను రిటైర్‌ అవుతా.. పొడిగించకండి

నేను రిటైర్‌ అవుతా.. పొడిగించకండి

· Business · ntnews.com

పదవీకాలంపై హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో ముంబై, ఆగస్టు 29: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శశిధర్‌ జగదీశన్‌ పునర్నియామకం కోసం పరిశీలనలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌ 26న తన పదవీకాలం ముగియనుండటంతో పునర్నియామకం కోసం వేచి చూడబోడని బ్యాంక్‌ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. జగదీశన్‌ ప్రస్తుత వయస్సు 61 ఏండ్లు, గత మూడు దశాబ్దాలుగా బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు. ఆయన వెనక్కి తగ్గడంతో నూతన వ్యక్తి కోసం బ్యాంక్‌ బోర్డు చర్యలను వేగవంతం చేసింది. కార్పొరేట్‌ ఇండియాలోని అతిపెద్ద విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు

Original source: ntnews.com
Read more on Kaizer News