Kaizer News

‘ది ప్యారడైజ్‌’లో ‘సమ్మక్క’.. అంచనాలు పెంచేసిన నాన

‘ది ప్యారడైజ్‌’లో ‘సమ్మక్క’.. అంచనాలు పెంచేసిన నాని

· Entertainment · sakshi.com

ది ప్యారడైజ్‌.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. మోహన్‌ బాబు, సంపూర్ణేష్‌ బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్‌, గ్లింప్స్‌, టీజర్‌ ..ప్రతీది సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. సెప్టెంబర్‌ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. నాని వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీయడమేకాకుండా..సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఇది ‘సమ్మక్క’ కథ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నానికి సినిమా టైటిల్‌పై ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ ది ప్యారడైజ్‌ చిత్రానికి మరో పేరు పెట్టాల్సి వస్తే..ఏం పెడతారు?’ అని యాంకర్‌ అడిగింది. దానికి నాని వెంటనే ‘సమ్మక్క’ అనే టైటిల్‌ ఈ కథకు వందశాతం సెట్‌ అవుతుందని చెప్పారు. (ఇదీ చదవండి: ‘రాకా’.. ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేది అప్పుడేనా.. ) సమ్మక్క ఎవరు? నాని నోటి నుంచి సమ్మక్క అనే పేరు రావడంతో.. అసలు సమ్మక్క ఎవరు? భారీ యాక్షన్‌ కథకు ఆ టైటిల్‌ ఎందుకు పెట్టాలనుకున్నారనేదానిపై సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నాని తల్లి పెరు ‘సమ్మక్క’ అట. ఇది తల్లి కొడుకు కథ అని దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల చాలా సార్లు చెప్పారు. తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్పాడు. అందుకే నాని ఈ కథకు ‘సమ్మక్క’ అనే టైటిల్‌ సరిపోతుందని చెప్పాడు. (ఇదీ చదవండి: ‘పీరియడ్స్‌ వస్తే నరకం.. నొప్పి భరించలేక కార్వాన్‌లో..’ ) తల్లి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయట. ఈ సినిమాలో నాని తల్లిగా మరాఠి నటి సోనాలి కులకర్ణి నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె లుక్‌, క్యారెక్టర్‌ డిజైన్‌ గురించి ఇప్పటి వరకు ఏ విషయం బయటకు రాలేదు. ఇప్పుడు నాని చేసిన కామెంట్స్‌తో ఆ పాత్రను ఎలా చూపిస్తారనే అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) లడ్డూ నెయ్యి వివాదంలో కీలక ట్విస్ట్.. జంతు కొవ్వుపై దర్యాప్తులో క్లారిటీ ది ప్యారడైజ్ సెన్సార్ రిపోర్ట్ ఇదే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..! కమలమ్మ పార్థివ దేహనికి విజయమ్మ, అవినాష్ రెడ్డి నివాళులు

Original source: sakshi.com
Read more on Kaizer News