బలమైన కథలు, ఊహించని మలుపులతో మలయాళం క్రైమ్ థ్రిల్లర్‌లు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. సహజమైన నటనతోపాటు వాస్తవికతకు దగ్గరగా ఉండే స్క్రీన్‌ప్లేలు కూడా ఈ సినిమాలను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఈ క్రమంలో కేరళంలో సంచలన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఉన్మాదం’.. ఇటీవలే ‘సోనీ లివ్' వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు వెర్షన్‌లోనూ విడుదలై.. ఇక్కడి ఆడియెన్స్‌నూ ఆకట్టుకుంటున్నది. ‘సినిమా కథ’లోకి వెళ్తే.. సినిమా పరిశ్రమలోకి వెళ్లాలనేది షెల్లీ (కుంచాకో బోబన్) జీవితాశయం