Kaizer News

10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస

10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!

· National - India · ntvtelugu.com

బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..! 8 Power 5G భారత్‌లో సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్.. ఈ ఫోన్‌లో భారీ 10,000mAh బ్యాటరీ 6.83 అంగుళాల 1.5K 120Hz AMOLED డిస్‌ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ 50MP OIS ప్రైమరీ కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్ కెమెరా.. Follow Us : --> Add as a preferred source on google POCO X8 Power 5G: భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు పోకో (POCO) రంగం సిద్ధం చేసింది. తాజాగా POCO X8 Power 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో విడుదల చేసిన టీజర్ ప్రకారం ఈ కొత్త ఫోన్ సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్ కానుంది. టీజర్‌లో POCO X8 Power 5Gను ఆకర్షణీయమైన డ్యూయల్ టోన్ ఎల్లో కలర్‌లో చూపించారు. ఫోన్ వెనుక భాగంలో సింపుల్, క్లీన్ డిజైన్‌ను అందించారు. వెనుక కెమెరాల కోసం స్క్విర్కిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. లీక్ అయిన, అంచనా స్పెసిఫికేషన్ల ప్రకారం ఈ మొబైల్ లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉండనుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. అలాగే గరిష్ఠంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించనున్నట్లు సమాచారం. దీంతో వీడియోలు, గేమింగ్, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను మంచి విజువల్ క్వాలిటీతో వీక్షించవచ్చు. రాబోయే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో ప్రధాన ఆకర్షణగా భారీ 10,000mAh బ్యాటరీ ఉండనుంది. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 3.5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించే వారికి, తరచూ ఛార్జింగ్ పెట్టుకోవడం ఇష్టంలేని వారికి ఈ భారీ బ్యాటరీ బెస్ట్ ఛాయస్ గా నిలువనుంది. పనితీరు విషయానికి వస్తే.. ఈ మొబైల్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 5 మొబైల్ ప్లాట్ఫారం ఉండనుంది. దీనికి LPDDR5X RAM, వేగవంతమైన స్టోరేజ్ ఆప్షన్లు జతకానున్నాయి. 5G కనెక్టివిటీతో పాటు రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి అవసరాలకు ఈ ఫోన్ మంచి పనితీరు అందించే అవకాశం ఉంది. కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండనుంది. ప్రైమరీ కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అధిక రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. POCO X8 Power 5G పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లు, ప్రారంభ సేల్ ఆఫర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే లాంచ్ ఈవెంట్‌లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనుంది. భారీ 10,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోన్ మిడ్‌రేంజ్ విభాగంలో బెస్ట్ ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది

Original source: ntvtelugu.com
Read more on Kaizer News