Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదురాంతగం సమీపంలో ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుదుచ్చేరి టూర్ ముగించుకుని చెన్నైకి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా వెనుక టైరు పేలడంతో వాహనం అదుపుతప్పినట్లు సమాచారం. దీంతో కారు పలుమార్లు పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు […]