Nizamabad: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల్ కొత్తపెల్లి గ్రామంలో వేములపల్లి శ్రీనివాస్ రేషన్ షాప్ డీలర్ ఇంట్లో భారీ చోరీ. ఇంటి యజమాన్యం కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి హైదరాబాద్ వెళ్లారు. దుండగులు ఇల్లుకు తాళం, ఉందని గమనించి సుమారు 30 తులాల బంగార ఆభరణాలు దొంగతనం చేస్తూ ఎత్తుకెళ్లారు. భారీ మొత్తంలో చోరీ కావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, ఆధారాలను సేకరించి, నిందితుల కోసం దర్యాప్తు చేపడుతున్నారు