Kaizer News

Hyderabad New IMAX Screen | త్వరలో బిగ్‌ స్ర్కీన్‌

Hyderabad New IMAX Screen | త్వరలో బిగ్‌ స్ర్కీన్‌ షురూ.. ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా?

· City - Hyderabad · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్ సినీ ప్రియులకు ఎట్టకేలకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది. నగరంలో ఒక అసలైన పెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ కోసం దాదాపు 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కల నెరవేరబోతోంది. ప్రసాద్ ఐమ్యాక్స్ ఫార్మాట్ మారిన తర్వాత నగరంలో సరైన బిగ్ స్క్రీన్ అనుభూతి కరవైన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఎఎంబీ క్లాసిక్ విక్టరీ థియేటర్‌లో సరికొత్త ఐమ్యాక్స్ స్క్రీన్ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని ఈ సరికొత్త ఐమ్యాక్స్ స్క్రీన్ డిసెంబర్ 2026 నాటికి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. కేవలం స్క్రీన్ మాత్రమే కాకుండా, దీనిపై ప్రదర్శించే మొదటి సినిమా గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ ఐమ్యాక్స్ స్క్రీన్‌పై ఫస్ట్ మూవీగా హాలీవుడ్ విజువల్ వండర్ ‘డూన్ పార్ట్ 3’ ప్రదర్శించే అవకాశం ఉందట. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాను చూసే ప్రేక్షకులు ఒక అద్భుతమైన అనుభూతిని పొందడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇదంతా ఒకెత్తైతే.. ఇండియన్ సినిమా మోస్ట్ అటెంటెడ్ ప్రాజెక్ట్‌ అయిన ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ లాంటి విజువల్ గ్రాండియర్‌ను ఈ కొత్త ఐమ్యాక్స్ స్క్రీన్‌పై చూస్తే ఆ మ్యాజిక్ ఏ లెవెల్‌లో ఉంటుందోనని ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త విజువల్స్ అందించే ఇలాంటి భారీ చిత్రాలకు ఈ కొత్త ఐమ్యాక్స్ స్క్రీన్ ప్రధాన వేదికగా మారనుంది

Original source: prabhanews.com
Read more on Kaizer News