Kaizer News

Medchal: కొల్తూరులో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ పాల

Medchal: కొల్తూరులో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ పాల్గొన్న ఎమ్మెల్యే!

· City - Hyderabad · hmtvlive.com

Medchal: మేడ్చల్ నియోజకవర్గంలోని ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరులో నూతనంగా నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News