మెగాస్టార్ చిరంజీవితో నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల సినిమా చేయబోతున్నారన్న అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘ప్యారడైజ్’ తర్వాత వెంటనే మెగా ప్రాజెక్ట్ మొదలవుతుందా అంటే దర్శకుడి నుంచి భిన్నమైన సమాధానం వచ్చింది. ‘ప్యారడైజ్’ రిలీజ్ అయ్యాక తన మెదడుకు విశ్రాంతి కావాలని, దాదాపు మూడు నెలల పాటు ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండబోతున్నానని శ్రీకాంత్ కుండబద్దలు కొట్టారు. చిరంజీవిగారికి కూడా ఇదే విషయం ముందే చెప్పానని, […]