Kaizer News

Hyderabad | ప్రేమ విఫలమై.. ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహ

Hyderabad | ప్రేమ విఫలమై.. ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

· City - Hyderabad · ntnews.com

Hyderabad | హైదరాబాద్‌లో దారుణం జరిగింది. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ నిభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. లవ్‌ఫెయిల్యూర్‌నే బలవన్మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్న నిభాష్ (25) పెట్లబుర్జులో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో నిభాష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఈ విషయాన్ని వాట్సాప్‌లో తన స్నేహితులకు సమాచారం అందించాడు. అయితే ఉదయం స్నేహితులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా.. నిభాష్ విగతజీవిగా కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News