Kaizer News

Kukatpally: కూకట్‌పల్లి ఐడీఎల్ లేక్ వద్ద ఉచిత మంచి

Kukatpally: కూకట్‌పల్లి ఐడీఎల్ లేక్ వద్ద ఉచిత మంచినీటి పంపిణీ!

· City - Hyderabad · hmtvlive.com

Shorts కూకట్‌పల్లి: ఐడియల్ లేక్ వద్ద బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ ఫౌండర్ అజయ్ రాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి బాలానగర్ డీసీపీ నరేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. ఐడియల్ లేక్ చుట్టుపక్కల మంచినీరు అందించే దుకాణాలు లేకపోవడంతో సందర్శకుల సౌకర్యార్థం తమ వంతు సహాయంగా ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు డీసీపీ నరేష్ రెడ్డి అభినందించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News