Kaizer News

రోడ్డు విస్తరణ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ ధర్నా

రోడ్డు విస్తరణ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ ధర్నా

· City - Hyderabad · ntnews.com

బండ్లగూడ: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో రోడ్డు విస్తరణ పనులను త్వరగా చేపట్టాలని బీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ వద్ద ధర్నా చేపట్టారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో మంజూరైన రోడ్లను ఇప్పటి వరకు విస్తరణ చేపట్టక పోవడం బాధాకరమన్నారు. బండ్లగూడ, కిస్మత్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతల మయంగా ఏర్పడి ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నా నియోజకవర్గం ప్రజా ప్రతినిధికి పట్టింపు లేకుండా పోయిందన్నారు. ఇండ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు

Original source: ntnews.com
Read more on Kaizer News