Kaizer News

Asia cup 2026 | రేపే భారత్‌ తొలి మ్యాచ్‌..

Asia cup 2026 | రేపే భారత్‌ తొలి మ్యాచ్‌..

· National - India · prabhanews.com

థాయ్‌లాండ్‌తో టీమిండియా పోరు.. ఎనిమిదో టైటిల్‌పై కన్నేసిన హర్మన్‌ప్రీత్ సేన దుబాయ్, ఆంధ్రప్రభ: మహిళల టీ20 క్రికెట్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. మహిళల టీ20 ఆసియా కప్-2026లో భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. రేపు థాయ్‌లాండ్‌తో జరిగే గ్రూప్-ఎ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని శుభారంభంతో మొదలుపెట్టాలన్న లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు బరిలోకి దిగుతోంది. 2026 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన నిరాశను వెనక్కి నెట్టి, ఆసియా కప్‌ను కొత్త ఆరంభంగా మార్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరలేకపోయిన భారత్‌కు ఈ టోర్నీ తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకునే మంచి వేదికగా మారింది. గత టోర్నీల్లో జరిగిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పటిష్టమైన ప్రదర్శన చేయాలనే ఉత్సాహంతో భారత అమ్మాయిలు సిద్ధమయ్యారు. గతంలో మహిళల ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో భారత్ అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. ఇప్పటివరకు 7 సార్లు ఆసియా కప్ గెలిచిన భారత్, ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను గెలవాలని పట్టుదలతో ఉంది. గత ఎడిషన్ 2024లో శ్రీలంకలోని దంబుల్లాలో జరిగింది. ఆ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు 2026 మహిళల టీ20 ఆసియా కప్‌లో మరోసారి టైటిల్ వేట కోసం భారత్ సిద్ధంగా ఉంది. గత టోర్నమెంట్ అనుభవం, ప్రస్తుత స్టార్ ప్లేయర్లతో ఈసారి టీమ్ ఇండియా మరింత బలంగా కనిపిస్తోంది. భారత బ్యాటింగ్‌లో ప్రధాన బలం స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఓపెనింగ్‌ జోడీ. మ్యాచ్‌ ఆరంభం నుంచే పరుగుల వేగాన్ని పెంచే సామర్థ్యం ఇద్దరికీ ఉంది. గత ఆసియా కప్‌లో షఫాలీ వర్మ 200 పరుగులతో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఈసారి కూడా ఆమెపై భారీ అంచనాలు ఉన్నాయి. స్మృతి మంధానతో కలిసి పవర్‌ప్లేలో భారత్‌కు శుభారంభం అందించగల సామర్థ్యం షఫాలీకి ఉంది. వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకుంటే థాయ్‌లాండ్‌ బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. భారత జట్టులో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ వంటి అనుభవజ్ఞులున్నారు. అవసరానికి తగ్గట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించడంతో పాటు వేగంగా పరుగులు సాధించే సామర్థ్యం ఈ జట్టుకు ఉంది. మధ్యవరుసలో హర్మన్‌ప్రీత్‌ అనుభవం కీలకం కానుంది. మ్యాచ్‌ పరిస్థితులకు అనుగుణంగా జట్టును ముందుకు నడిపించడంలో ఆమె పాత్ర ఎంతో ముఖ్యమైనది. వికెట్‌కీపర్‌ రిచా ఘోష్‌ దూకుడైన బ్యాటింగ్‌ కూడా భారత్‌కు అదనపు బలం. బౌలింగ్‌లో భారత్‌కు అనుభవం, యువశక్తి రెండూ కలిసొచ్చాయి. దీప్తి శర్మ నేతృత్వంలోని స్పిన్‌ విభాగం జట్టుకు ప్రధాన బలం. గత ఆసియా కప్‌లో దీప్తి శర్మ 10 వికెట్లతో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఈసారి దీప్తితో పాటు శ్రీ చరణి, రాధా యాదవ్‌, ప్రేమా రావత్‌ స్పిన్‌ విభాగంలో ఉన్నారు. ముఖ్యంగా శ్రీ చరణిపై ప్రత్యేక దృష్టి ఉంది. పొట్టి ఫార్మాట్‌లో పరుగులను నియంత్రిస్తూ కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం ఆమెకు ఉంది. పేస్‌ విభాగంలో రేణుకా ఠాకూర్‌కు అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్‌, నందిని శర్మ తోడుగా ఉన్నా

Original source: prabhanews.com
Read more on Kaizer News