Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందింది. శనివారం తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో శనివారం ఉదయం నుంచే బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిశాయి. ఇక రాబోయే కొన్ని గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు పరిసరాల్లో మొదలైన ఉరుముల వానలు జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకూ వ్యాపించి, పిడుగులు, ఈదురుగాలులతో విరుచుకుపడే అవకాశం ఉందని సమాచారం. రానున్న కొన్ని గంటల్లో వర్షం జోరు మరింత పెరిగే సూచనలు ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు