దేశంలో వివిధ పండ్ల సాగుకు పేరొందిన ప్రాంతాలను ఆయా పండ్ల సిటీ పేర్లతో పిలుస్తున్నారు. వివిధ పండ్ల సాగు, ఉత్పత్తి అధికంగా జరగడంతో పాటు నాణ్యత గల పండ్లను అందించడంలో ప్రాధాన్యమున్న నగరాలు, ప్రాంతాలు ఆయా పండ్లకు రాజధానులుగా పేరొందాయి. దేశంలో వందలాది నగరాలు ఉన్నాయని, వాటిలో ప్రతి నగరానికీ దానికంటూ ఒక ప్రత్యేకమైన ‘ముద్దుపేరు’ ఉందని మీకు తెలుసా ? ఏమిటీ ఈ పండ్ల రాజధానుల ప్రాధాన్యం, వాటి విశిష్ఠత గురించి తెలుసుకుందాం. 1. మామిడి నగరం.. మాల్దా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా నగరాన్ని భారతదేశపు మామిడి నగరంగా పిలుస్తారు. కోల్‌కతాకు విమానంలో చేరుకుని అక్కడినుంచి ఆరు గంటల రైలు, రోడ్డు మార్గాల ద్వారా మాల్దాకు చేరుకోవచ్చు. ఇంతటి ఘనత దక్కించుకున్న మాల్దా నగరం వేసవి కాలంలో మామిడి పండ్లకు స్వర్గధామంగా మారుతోంది. పండిన మామిడి పండ్ల సువాసన గాలిలో నిండి, సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ మామిడి నగరంలో మే నెలలో చెట్లపైనే పండిన తాజా మామిడి పండ్లను కోసుకొని తినొచ్చు. ఈ నగరం కేవలం దాని మామిడి దిగుబడికే కాకుండా, దాని నాణ్యత, వారసత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండుతున్న ఫజ్లీ, హిమ్‌సాగర్, లక్ష్మణ్‌భోగ్ వంటి ప్రసిద్ధ మామిడి రకాలకు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మంచి గిరాకీ ఉంది. మామిడి సాగుకు అనువైన ఈ ప్రాంతంలోని సారవంతమైన ఒండ్రుమట్టి, తేమతో కూడిన వాతావరణం ఉంది. అంతేకాకుండా తరతరాలుగా రైతులు ఈ తోటలను సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడ మామిడి కేవలం ఒక పండు మాత్రమే కాదు, అది జీవనోపాధికి, సాంస్కృతిక గుర్తింపునకు మూలం. పొలాల్లో పనిచేసే ప్రజలు, మామిడి పండ్లను కోసే కూలీలు, వాటిని వేరుచేసి రవాణా చేయడానికి చేసే సన్నాహాలు అన్నీ చూడముచ్చటగా ఉంటాయి. 2. భారతదేశపు అరటి రాజధాని.. జల్గావ్ భారతదేశపు అరటి రాజధాని బిరుదు మహారాష్ట్రలోని జల్గావ్‌కు దక్కుతుంది. ఈ జిల్లా తన అసాధారణమైన అరటి ఉత్పత్తి, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, సారవంతమైన నేల, ఆధునిక వ్యవసాయ పద్ధతుల కారణంగా జాతీయ గుర్తింపును పొందింది. జల్గావ్ జిల్లా మహారాష్ట్ర మొత్తం అరటి సాగు విస్తీర్ణంలో 69 శాతం వాటాను కలిగి ఉంది. జల్గావ్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు అరటి సాగుకు వెన్నెముకగా నిలుస్తుంది. ఇది వేలాది మంది రైతులకు, రవాణా, ప్యాకేజింగ్, నిల్వ, వాణిజ్యంలో పాలుపంచుకునే సంబంధిత పరిశ్రమలకు మద్దతునిస్తుంది. టిష్యూ కల్చర్ ఫార్మింగ్, డ్రిప్ ఇరిగేషన్, శాస్త్రీయ పంట నిర్వహణ పద్ధతులు వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం కూడా ఈ జిల్లా విజయానికి దోహదపడింది. పలు నాణ్యమైన అరటి రకాలను ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందింది. జల్గావ్ అరటిపండ్ల భౌగోళిక మూలాన్ని గుర్తించి జీఐ ట్యాగ్ ఇచ్చారు. 3. చాక్లెట్ టౌన్.. ఊటీ తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న అందమైన పర్వత ప్రాంతం ఊటీ. భారతదేశపు చాక్లెట్ టౌన్‌గా ప్రసిద్ధి చెందింది? తియ్యగా ఉండే చాక్లెట్ అంటే అందరూ ఇష్టపడుతుంటారు. దీన్ని ఉష్ణమండల వాతావరణంలో చెట్లపై పెరిగే కోకో గింజల నుంచి తయారు చేస్తారు. చాక్లెట్ తయారు చేయడానికి, ఈ గింజలను పులియబెట్టి, ఎండబెట్టి, వేయించడం ద్వారా వాటిలోని