Kaizer News

నేపాల్‌లో మహా విషాదం.. పెరుగున్న మృతుల సంఖ్య..

నేపాల్‌లో మహా విషాదం.. పెరుగున్న మృతుల సంఖ్య..

· National - India · prabhanews.com

కు చేరిన మృతుల సంఖ్య 2,400 మందికిపైగా గల్లంతు.. సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణం అడ్డంకి ఖాట్మండు, ఆంధ్రప్రభ : నేపాల్‌ను కుదిపేసిన భారీ ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య 669కు చేరగా, మరో 2,400 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్‌తో పాటు టిబెట్‌ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. హిమాలయ పర్వత ప్రాంతంలో భారీగా మంచు, రాళ్లు విరిగిపడటంతో బుధవారం ఈ విపత్తు సంభవించినట్లు అధికారులు తెలిపారు. పర్వత ప్రాంతాల నుంచి నీరు, మంచు, బురద, శిథిలాలు ఒక్కసారిగా దూసుకువ‌చ్చాయి. దీంతో ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా, రహదారులు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌, సమాచార వ్యవస్థలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక‌, అత్యంత ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం సహాయక బృందాలకు పెద్ద సవాలుగా మారింది. దెబ్బతిన్న రహదారులు, ప్రతికూల వాతావరణం, మరోసారి వరదలు వచ్చే ప్రమాదం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. అనేక ప్రాంతాలు ఇంకా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో శనివారం నువాకోట్‌ జిల్లాలో వాతావరణం కొంత అనుకూలించడంతో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను పునరుద్ధరించారు. ఆహారం, దుస్తులు, బియ్యం, ఇతర నిత్యావసరాలను బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వరదల్లో చిక్కుకున్న పలువురు బాధితులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులను ముందుగా రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. చైనాలోని టిబెట్‌ ప్రాంతంలో కూడా ఈ ప్రకృతి విపత్తు తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ ఏడుగురు మృతి చెందగా, 554 మంది గల్లంతైనట్లు చైనా అధికారులు వెల్లడించారు. అయితే నేపాల్‌, టిబెట్‌ ప్రాంతాల్లో గల్లంతైన వారి వివరాల్లో కొంత గందరగోళం ఉండటంతో మొత్తం సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ట్రిశూలీ, నారాయణి నదుల ఒడ్డున లభిస్తున్న మృతదేహాలను గుర్తింపు కోసం పోఖరాకు తరలిస్తున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన కొన్ని మృతదేహాలు తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తింపు ప్రక్రియ కూడా క్లిష్టంగా మారింది. మృతులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రులు, సహాయక కేంద్రాల వద్ద తమ ఆత్మీయుల కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ వేలాది మంది ఆచూకీ లేకపోవడంతో సహాయక సిబ్బంది రేయింబవళ్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద, నదీ పరివాహక ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది

Original source: prabhanews.com
Read more on Kaizer News