Kaizer News

క్రైమ్‌ పారామీటర్లలో రామగుండం పోలీసుల ప్రతిభ

క్రైమ్‌ పారామీటర్లలో రామగుండం పోలీసుల ప్రతిభ

· City - Hyderabad · prabhanews.com

గోదావరిఖని, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయిలో నేర నియంత్రణకు సంబంధించిన వివిధ ప్రమాణాల అమలులో రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్రంలోని వివిధ పోలీసు విభాగాల పనితీరును అధికారులు సమీక్షించి, అత్యుత్తమ పనితీరు కనబరిచిన విభాగాలను గుర్తించారు. ఈ క్రమంలో క్లస్టర్‌–1లో హైదరాబాద్‌, క్లస్టర్‌–2లో రామగుండం, క్లస్టర్‌–3లో నల్గొండ, క్లస్టర్‌–4లో సూర్యాపేట పోలీసు విభాగాలు మొదటి స్థానాల్లో నిలిచాయి. ఆయా విభాగాల పనితీరును అధికారులు అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్‌లకు శనివారం డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి, మెరుగైన ఫలితాలు సాధించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. పోలీసు విభాగాల పనితీరు మరింత మెరుగుపడేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News