Kaizer News

Tarnaka: ఓయూలో నూతన విద్యార్థుల కోసం వీఎస్‌జే హెల్

Tarnaka: ఓయూలో నూతన విద్యార్థుల కోసం వీఎస్‌జే హెల్ప్ డెస్క్!

· City - Hyderabad · hmtvlive.com

Shorts Tarnaka: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో నూతన విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి విద్యార్థి జన సమితి (వీఎస్‌జే) ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ నిర్వహించారు. టీజేఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఓయూ విద్యార్థి నాయకుడు కడారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ డెస్క్ ద్వారా విద్యార్థులకు అడ్మిషన్లకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. సర్టిఫికెట్ల సమర్పణ, కౌన్సెలింగ్, కోర్సుల ఎంపిక, ఫీజులు తదితర అంశాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి అవసరమైన సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో టీజేఎస్ స్టూడెంట్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి జిల్లాపెల్లి దిలీప్ కుమార్ పాల్గొని నూతన విద్యార్థులతో మాట్లాడారు. అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని యూనివర్సిటీ అధికారులు స్పష్టంగా అందించి అడ్మిషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని రమేష్ యాదవ్, జిల్లాపెల్లి దిలీప్ కుమార్ కోరారు. విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారానికి నిరంతరం అండగా ఉంటామని పేర్కొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News