Chintoor: పోలవరంజిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సోడె రాజ్ కుమార్(30) వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో శబరి నది అవతలి ఒడ్డు ఉన్న విద్యుత్ టవర్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన విషయం తెలుసుకున్న చింతూరు సీఐ గోపాలకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి ఆత్మహత్య కు గల కారణాలను ఆరా తీశారు.వివాహిత సంబంధం కలిగి ఉండటంతో ఇంట్లో గొడవలు అవుతున్నందున రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు సిఐ గోపాలకృష్ణ తెలిపారు