ఆగస్ట్ నెల ముగుస్తోంది.. సెప్టెంబర్ నెల ప్రారంభమవుతోంది. కొత్త నెల ప్రారంభంతోనే కొన్ని ధరలు మారడం, మరికొన్ని నిబంధనలు అమల్లోకి రావడం సాధారణమే. అయితే ఈసారి సెప్టెంబర్ 1 నుంచి సామాన్యుల రోజువారీ జీవితంపై ప్రభావం చూపే పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వంటగ్యాస్ నుంచి కార్ల ధరలు, ఆదాయపు పన్ను రిటర్నులు, అంతర్జాతీయ విమాన ప్రయాణం వరకు కీలక పరిణామాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా.. మరికొన్ని ఆగస్టు 31తో గడువు ముగుస్తున్న అంశాలు. అవేంటో చూద్దాం.. దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన ఎల్‌పీజీ ధరలను సమీక్షిస్తాయి. దీంతో సెప్టెంబర్ 1న కూడా 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరల్లో మార్పు ఉంటుందా అనే దానిపై వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టులో గృహ ఎల్‌పీజీ ధరల్లో మార్పు లేకపోగా, వాణిజ్య సిలిండర్ ధరను కంపెనీలు తగ్గించాయి. ఉదాహరణకు ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ రూ.942గా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రూ.2,738గా ఉంది. సెప్టెంబర్ ధరలను చమురు కంపెనీలు నిర్ణయించాల్సి ఉంది. గృహ ఎల్‌పీజీ వినియోగదారులకు ఆగస్టు 31 కీలక తేదీ. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులు గడువులోపు ప్రక్రియను పూర్తి చేయకపోతే గ్యాస్ రీఫిల్ పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చమురు మార్కెటింగ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కనెక్షన్ తాత్కాలికంగా నిలిపివేయడం లేదా సబ్సిడీ/దేశీయ ధర ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని వారు ఆలస్యం చేయకుండా ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. సెప్టెంబర్ 1 నుంచి టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనుంది. కార్లు, ఎస్‌యూవీలపై మోడల్, వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.25,000 వరకు ధర పెరగనుంది. ఈ పెంపు పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్లకూ వర్తిస్తుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కొంతవరకు భర్తీ చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా సెప్టెంబర్ నుంచి తన మొత్తం వాహన శ్రేణిపై గరిష్ఠంగా 1 శాతం ధర పెంచనుంది. మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు మారుతుంది. పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, నిర్వహణ వ్యయాలు, భౌగోళిక-రాజకీయ పరిస్థితుల ప్రభావమే ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది. ఇది 2026లో హ్యుందాయ్ చేపడుతున్న మూడో ధర సవరణగా నిలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి భారత్ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్‌పై ప్రత్యేకంగా స్టాంప్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులు తమ డిజిటల్ బోర్డింగ్ పాస్ లేదా ప్రింటెడ్ కాపీని చూపించి ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ మార్పు విమానాశ్రయాల్లో కాగితపు ప్రక్రియను తగ్గించి, ప్రయాణికులకు వేగవంతమైన ఇమ్మిగ్రేషన్ అనుభవాన్న