తమిళ మూవీస్‌కు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉంటుంది. రీసెంట్‌గా థియేటర్లలో రిలీజైన తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. మరి ఆ మూవీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే... తమిళ యంగ్ హీరో రియో రాజ్, వర్తిక చేతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ మూవీనే రామ్ అండ్ లీలా. ఈ మూవీకి రామచంద్రన్ కన్నన్ దర్శకత్వం వహించగా... ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. ఆగస్ట్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. మూవీలో రియో రాజ్, వర్తికా చేతన్‌లతో పాటు మునీష్ కాంత్, మాళవికా అవినాష్, దీపా వెంకట్, ఆనంద్ కీలకపాత్రల్లో నటించారు. అంకిత్ మీనన్ మ్యూజిక్ అందించారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో పాటు కామెడీ టచ్ ఆకట్టుకుంటోంది. డొచ్చంటే? రఘురామ్ అలియాస్ రామ్ (రియో రాజ్) కు 30 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాదు. అరేంజ్డ్ మ్యారేజెస్, మ్యాట్రిమొనీ సైట్లలో సంబంధాలు చూసి చూసి విసిగిపోతాడు. అలా తీవ్ర నిరాశలో ఉన్న రామ్ ఓ రోజు లోకల్ ట్రైన్‌లో వెళ్తుండగా... లీల (వర్తికా చేతన్) పరిచయం అవుతుంది. అలా వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. రామ్ లవ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పిన లీల ఓ కండీషన్ పెడుతుంది. తనను పెళ్లి చేసుకోవాలంటే సాయంత్రం 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తన వైపు చూడకూడదంటూ రూల్ పెడుతుంది. అయితే, మొదట్లో ఇదేదో సరదా కండీషన్ అనుకున్నా తర్వాత సీరియస్‌గా మారుతుంది. అసలు రాత్రి వేళ లీలా ఏం చేస్తుందోనని తెలుసుకునేందుకు రామ్ అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. ఆ తర్వాతే వారికి ఊహించని నిజం తెలుస్తుంది. అసలు 6 తర్వాత ఏం జరుగుతుంది? లీలకు ఎలా మారుతుంది? నిజం తెలిసిన తర్వాత రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. స్ట్రీమింగ్ అంటే? NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి? హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ హైదరాబాద్ మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం నిజామాబాద్ అడవుల్లో దొరికే అరుదైన బుడుం పండు.. ఆదివాసీలకు జీవనోపాధి, తినేవారికి ఆరోగ్యం క్రికెట్ బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సె