Kaizer News

LB Nagar: సిరి నగర్‌లో ఘనంగా గణనాథుడి మహా అన్నదానం

LB Nagar: సిరి నగర్‌లో ఘనంగా గణనాథుడి మహా అన్నదానం

· City - Hyderabad · hmtvlive.com

Shorts ఎల్బీనగర్: గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎల్బీనగర్ సిరి నగర్ కాలనీలో అజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 26వ సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యూత్ సభ్యులు కుంచెం భాగ్యమ్మ, కుంచెం వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1500 మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంచెం ప్రవీణ్ కుమార్ గుప్తా, శ్రీకాంత్, మల్లికార్జున్, వినోద్, రఘు, ప్రశాంత్, శ్రీనివాస్, రాఘవేందర్, దోరాబాబు, శివ, కిషోర్, సురేష్, రిషీ, రాజు, కిరణ్, రితిష్, సాయి దేవరకొండ, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News