Kaizer News

ఆదివాసీ పల్లెల్లోకి నల్లా ఎలా వచ్చింది?

ఆదివాసీ పల్లెల్లోకి నల్లా ఎలా వచ్చింది?

· City - Hyderabad · ntnews.com

ఆ ఊరులో విద్యుత్తు లేదు, రహదారీ లేదు, అంగన్‌వాడీ లేదు. కానీ… ఇంటి ముందే నల్లా ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గిరిజన ఆవాసంలో మేం ఫీల్డ్‌ విజిట్‌ చేస్తున్నాం. దట్టమైన అటవీ ప్రాంతంలోని ఆ పల్లెలో 30 కుటుంబాలకు చెందిన 125 మంది గుత్తికోయ ఆదివాసీలు నివసిస్తున్నారు. ‘మాకు కరెంట్‌ లేదు… రహదారి లేదు… మా పిల్లలకు అంగన్‌వాడీ బడి కూడా లేదు…’ అని ఒక మహిళ తన బాధలను చెప్పింది. తాగునీరు ఉన్నదా? అని అడిగాం. అప్పుడే ఒక యువకుడు ముందుకొచ్చాడు. ‘నీళ్లకు లోటులేదు… వాటి వల్లనే మేం ఈ మాత్రం జీవిస్తున్నాం’ అని తెలిపాడు. ఆ మాట మమ్మల్ని ఒక్క క్షణం ఆపింది. మీకు నీళ్లు ఎలా వస్తున్నాయి? అని అడిగాం. అతను పక్కనే ఉన్న నల్లాను చూపించాడు. మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయని తెలిపాడు. మారుమూల గిరిజన పల్లెలో కూడా మిషన్‌ భగీరథ పైపుల ద్వారా ప్రతి ఇంటికీ రోజుకు రెండుసార్లు నీళ్లు వస్తున్నాయి. అడవిలో మిగిలిన అన్ని చీకట్ల మధ్య ఆ చిన్న నల్లా ఒక పెద్ద వెలుగులా అనిపించింది. ఎందుకంటే… తాగునీరు అంటే దాహం తీర్చే నీరు మాత్రమే కాదు. అది ఆరోగ్యం, అది సమయం. అది మహిళల శ్రమకు విముక్తి. అది పిల్లల బాల్యం. అది ఒక కుటుంబం తన గౌరవంతో జీవించే అవకాశం. తెలంగాణలోని అనేక మారుమూల, గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కోసం మహిళలు, పిల్లలు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. కొన్ని చోట్ల బావులు, వాగులు, చెలిమెలే ఆధారం. వేసవిలో అవి ఎండిపోతే పరిస్థితి మరింత దారుణంగా మారేది. నీరు దొరికినా అది తప్పనిసరిగా సురక్షితమైన నీరు అవుతుందనే నమ్మకం ఉండదు. వాగుల్లో ప్రవహించే నీటిలోనే పశువులు తిరుగుతుంటాయి. అదే నీటిని ప్రజలు వడకట్టుకుని, మరిగించి లేదా కొన్నిసార్లు ఎలాంటి శుద్ధి లేకుండానే తాగాల్సి వచ్చేది. నీటి కోసం వెళ్లే ప్రతి ప్రయాణమూ అంటే ఒక మహిళకు గంటల సమయం. ఆమె ఆ సమయాన్ని కోల్పోతే కుటుంబ ఆదాయానికి, పిల్లల చదువుకు, తన ఆరోగ్యానికి నష్టం. అందుకే ఇంటి ముందుకు వచ్చే సురక్షితమైన నీటి నల్లా ఒక మౌలిక సదుపాయం మాత్రమే కాదు, సామాజిక మార్పుకు ఒక తొలి అడుగు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన, స్థిరమైన పైపుల తాగునీటిని అందించేందుకు భారీ స్థాయిలో మిషన్‌ భగీరథ పథకాన్ని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. 2016 ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని కోమటిబండలో మిషన్‌ భగీరథను అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికీ రోజుకు 100 లీటర్ల చొప్పున శుద్ధి చేసిన నీటిని అందించడం, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలు, వాటి ఉపనదులు, ప్రధాన జలాశయాలను నీటి వనరులుగా ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మిషన్‌ భగీరథ వెబ్‌సైట్‌ ప్రకారం ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో 23,861 గ్రామీణ ఆవాసాలు, 54.61 లక్షల గ్రామీణ గృహాలు ఉన్నాయి. మొత్తం పైపులైన్‌ నెట్‌వర్క్‌ సుమారు 1.50 లక్షల కిలోమీటర్లు. 2021 తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ ప్రక

Original source: ntnews.com
Read more on Kaizer News