Kaizer News

MLC Rahmat Baig Suspension: ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌

MLC Rahmat Baig Suspension: ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు.. దమ్ముంటే కారణం చెప్పాలి: అసదుద్దీన్‌కు రాజా సింగ్ ఛాలెంజ్

· City - Hyderabad · telugu.abplive.com

మజ్లిస్ ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసింది. ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించింది. మహిళలతో అసభ్య ప్రవర్తన, మైనర్ పై అత్యాచారం ఆరోపణలు వెలువడ్డాయి. సస్పెన్షన్ వెనుక కారణాలు చెప్పాలని రాజాసింగ్ ఒవైసీని ప్రశ్నించారు. హైదరాబాద్‌: మజ్లిస్ (AIMIM) పార్టీ తమ ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. రహ్మత్ బేగ్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీంతో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేస్తూ లేఖను తెలంగాణ శాసన మండలి చైర్మన్‌కు సమర్పించాలని రహ్మత్ బేగ్‌ను పార్టీ అధిష్టానం ఆదేశించింది. పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం వెలువడింది. 4 రోజుల క్రితం అత్తాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌పై ఆరోపణలు వచ్చాయి. దాంతో పాటు మైనర్ పై అత్యాచారం చేశాడని సైతం ఆరోపణలు రావడంతో ఎంఐఎం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పార్టీకి చెడ్డ పేరు రాకూడదని, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పార్టీలో కొనసాగితే ఎంఐఎంకే నష్టమని భావించి అసదుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేయాలని ఆదేశించారని ప్రచారం జరుగుతోంది. రాత్రికి రాత్రే, ఉన్నపళంగా ఎంఐఎం ఎమ్మెల్సీపై పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఆయనను ఎందుకు సస్పెండ్ చేశారో తమకు చెప్పాలని ఎంఐఎం నేతలతో పాటు ఓటు వేసిన వారు సైతం అడుగుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఓ వీడియో విడుదల చేశారు. ఓల్డ్ సిటీ ముస్లింలకు అసదుద్దీన్ ఏం సమాధానం చెబుతారు: రాజా సింగ్ ఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌ను రాత్రికి రాత్రే సస్పెండ్ చేస్తున్నట్లు ఎంఐఎం ఎక్స్ ఖాతాలో ప్రకటించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. అర్ధరాత్రి వేళ ఏ కారణంతో ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై సస్పెన్షన్ వేటు వేశారో ఓల్డ్ సిటీలోని ముస్లిం ప్రజలకు అసదుద్దీన్ ఒవైసీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా రహమత్ బేగ్ భూ కబ్జాలు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్నప్పుడు ఒవైసీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. అంటే ఆ భూ ఆక్రమణలు, భూ కబ్జాల్లో అసదుద్దీన్‌కు కూడా వాటాలు ఉండటమే అందుకు కారణమా అని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్సీ ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి/ సెక్స్ స్కాండల్‌లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు. ఆ వీడియోలు బయటకు వచ్చి వైరల్ కావడం, కొందరు తీవ్రంగా ప్రశ్నించడంతోనే ఒవైసీ తన ప్రతిష్ఠ కాపాడుకునేందుకు హడావుడిగా సస్పెండ్ చేశారని రాజా సింగ్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ చిన్న సంఘటన జరిగినా జాతీయ మీడియా ముందుకు వచ్చే ఒవైసీ, ఇప్పుడు ధైర్యముంటే మీడియాను పిలిచి తన ఎమ్మెల్సీ అక్రమాలపై, అర్ధరాత్రి సస్పెన్షన్ వెనుక ఉన్న అసలు కారణాలపై సమాధానం ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. Frequently Asked Questions ఎంఐఎం పార్టీ తమ ఎ

Original source: telugu.abplive.com
Read more on Kaizer News