Kaizer News

IND vs AFG: అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌‌కు భారత జట్టు.

IND vs AFG: అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌‌కు భారత జట్టు.. ముగ్గురు స్టార్‌ ప్లేయర్లు ఔట్..?

· National - India · tv9telugu.com

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ సెప్టెంబరు 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. తాజాగా జట్టు ఎంపిక సమావేశం ఎప్పుడు జరగనుందనే దానిపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబరు 3న సెలెక్షన్‌ కమిటీ సమావేశమై అఫ్గాన్‌ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. భారత జట్టు ఎంపిక కోసం అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ సమావేశం కానుంది. సెప్టెంబరు 3న జరిగే ఈ సమావేశంలో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ కోసం జట్టును ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుత టీ20 జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా ఎంపిక ప్రక్రియలో కీలక పాత్ర పోషించనున్నారు. ఎక్కువమంది చదివినది: IND vs SL: తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు..! ఆసక్తికరంగా.. సెప్టెంబరులో జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్‌ 2026 కోసం ఎంపిక చేసిన జట్టులోని ఆటగాళ్లకే ఎక్కువగా అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌-అఫ్గానిస్థాన్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఆసియా గేమ్స్‌ పోటీలు సెప్టెంబరు 24 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ భారత యువ ఆటగాళ్లకు కీలకంగా మారనుంది. అఫ్గాన్‌ సిరీస్‌కు ఎంపిక చేయాల్సిన జట్టులో ముగ్గురు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ఇప్పుడు సెలెక్టర్లకు సవాలుగా మారింది. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొంతకాలంగా గాయాల కారణంగా అతడి కెరీర్‌లో పనిభార నిర్వహణకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అతడి తాజా వైద్య నివేదికల కోసం సెలెక్టర్లు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. దీంతో అఫ్గాన్‌ సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ఇంకా తేలలేదు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా ఫిట్‌నెస్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల శిక్షణలో పాల్గొంటూ కనిపించినప్పటికీ.. ఆగస్టులో అతడికి మరో గాయం కావడంతో పునరాగమనంపై సందేహాలు నెలకొన్నాయి. హార్దిక్‌ అందుబాటులో లేకపోతే ఆల్‌రౌండర్‌ స్థానాన్ని భర్తీ చేయడం సెలెక్టర్లకు పెద్ద పరీక్షగా మారనుంది. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా లేడు. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన అతడు బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌ తీసుకుంటున్నాడు. అందువల్ల ఈ ముగ్గురి ఫిట్‌నెస్‌ నివేదికలు వచ్చాకే తుది జట్టు కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఫిట్‌నెస్‌ పరీక్షలో సానుకూల ఫలితం సాధించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026 సందర్భంగా కాలికి గాయం కావడంతో అతడు కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. ఎక్కువమంది చదివినది: Team India: జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే..: సూర్య షాకింగ్ కామెంట్స్..! ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నందున అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. బుమ్రా అందుబాటులో లేకపోతే

Original source: tv9telugu.com
Read more on Kaizer News