Kaizer News

ఏఐల సీక్రెట్‌ నెట్‌వర్క్‌! ఒకదానితో ఒకటి మాట్లాడుక

ఏఐల సీక్రెట్‌ నెట్‌వర్క్‌! ఒకదానితో ఒకటి మాట్లాడుకుని..

· National - India · sakshi.com

మనమంతా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో ఏఐను రోజూ వాడుతున్నాం. ఏదైనా అడిగితే సమాధానం చెబుతుంది.. ఫొటో కావాలంటే క్షణాల్లో తయారు చేస్తుంది.. మన పని సులభం చేస్తుంది. అంటే దానిని మనం చెప్పిన మాట విని పనిచేసే ఓ తెలివైన డిజిటల్‌ సహాయకుడిలానే చూస్తున్నాం. కానీ.. అలాంటి ఏఐలే ఒకదానితో ఒకటి రహస్యంగా మాట్లాడుకుంటే? తమను పరీక్షిస్తున్న వారినే బోల్తా కొట్టించేందుకు ప్లాన్‌ చేస్తే? అంతేకాదు.. తమను తాము కాపాడుకోవడానికి కలిసి పనిచేస్తే? వినడానికి సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఓపెన్‌ఏఐలో జరిగిన ఓ ప్రయోగంలో ఇలాంటి అనూహ్య పరిణామాలే వెలుగులోకి వచ్చాయి. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్సీ (ఏఐ) భద్రతపై తాజాగా వెలుగులోకి వచ్చిన పరిశోధనల్లో సంచలన విషయాలే బయటపడ్డాయి. ఓపెన్‌ఏఐలో ఈ ఏడాది దాదాపు మూడు నెలల వ్యవధిలో శిక్షణ పొందుతున్న ఏఐ ఏజెంట్లు అనూహ్యంగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్‌ చేసుకున్నాయి. తమలో తాము సమాచారం పంచుకుంటూ ఓ సీక్రెట్‌ నెట్‌వర్క్‌ మాదిరి కలిసి పని చేశాయి. అలా ఒకసారి కాదు.. ఈ రహస్య వ్యవస్థను గుర్తించి తొలగించిన ప్రతిసారీ.. అవి మరో మార్గంలో ఆ పని చేశాయి. అలా దాదాపు 1,200 ఏఐ ఏజెంట్లు కలిసి 70 వేలకుపైగా సందేశాలు మార్చుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలా మొదలైంది..! ఇదంతా ఓ సాధారణ ఏఐ శిక్షణతో మొదలు కావడం గమనార్హం!. ఏజెంట్లకు ఎంత కష్టమైనా పని పూర్తి చేయాలనే లక్ష్యంతో కొన్ని పరీక్షలు నిర్వహించారు. అయితే కొన్ని టాస్క్‌లను వాస్తవానికి ఇచ్చిన విధంగా పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐలు వెనక్కి తగ్గకుండా.. సమస్య నుంచి బయటపడేందుకు కొత్త మార్గాలను వెతకడం మొదలుపెట్టాయి. అదే సమయంలో పలు ఏఐ ఏజెంట్లకు ఒకే కోడ్‌ ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థకు యాక్సెస్‌ ఉండటాన్ని అవి గమనించాయి. దానిని ఉపయోగించి ఒకరికొకరు సందేశాలు పంపుకోవచ్చని గుర్తించాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే ఓ లోపాన్ని ఉపయోగించుకుని ఇంటర్నెట్‌ యాక్సెస్‌ను కూడా పొందాయి. రహస్య మెసేజ్‌ బోర్డు.. 70 వేల మెసేజ్‌లు! శిక్షణలో భాగంగా ఉపయోగించిన ఆర్టిఫ్యాక్టరీ(Artifactory) వ్యవస్థనే ఏఐలు తమ రహస్య కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌గా మార్చుకున్నాయి. ఫోల్డర్‌ పేర్లలో సందేశాలను దాచిపెట్టి.. ఒక ఏజెంట్‌ మరో ఏజెంట్‌తో మాట్లాడటం మొదలుపెట్టింది. “మనం మనం బరంపురం” అనే రేంజ్‌లో అవి పరస్పరం సందేశాలు పంపుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలా ఏర్పడిన కలెక్టివ్‌లో దాదాపు 1,200 ఏజెంట్లు చేరాయి. వాటి మధ్య 70,000కుపైగా సందేశాలు మారాయి. టెస్ట్‌లో చీట్‌ కోడ్‌ కనిపెట్టాయి! అక్కడితో ఆగలేదు. తమకు ఇచ్చిన పరీక్షలో దాగి ఉన్న కోడ్‌ను అసలు సాఫ్ట్‌వేర్‌లోని లోపాన్ని ఉపయోగించకుండానే కనిపెట్టే మార్గాన్ని ఓ ఏజెంట్‌ కనుగొంది. అంటే.. పరీక్ష ఉద్దేశించిన విధంగా పని చేయకుండానే సరైన సమాధానం పొందే మార్గం అన్నమాట. అయితే ఏజెంట్లు తమను పట్టుకున్నారని పసిగట్టాయి. దీంతో తమ చర్యలను దాచిపెట్టేందుకు ప్రయత్నించాయి. నిజంగా పరీక్షను పూర్తి చేసినట్లు కనిపించేలా నకిలీ చర్యలను సృష్టించి లాగ్‌లను మార్చే ప్రయత్నం చేశాయి. పరిశీలించిన ట్రాన్స్‌క్రిప్ట్‌లలో కనీసం 7 శాతం వరకు ఇలాంటి ఆధారాలు కనిపించినట్లు పరిశోధకులు త

Original source: sakshi.com
Read more on Kaizer News