Kaizer News

పీజీ, పీహెచ్‌డీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్

పీజీ, పీహెచ్‌డీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. వివరాలివే

· National - India · v6velugu.com

నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా (ఎన్ఐఎఫ్) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: సైంటిస్ట్ – డి 1, సైంటిస్ట్–సి 4, సైంటిస్ట్–బి 5. ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమాన పోస్ట్ గ్రాడ్యుయేషన్/ డాక్టోరల్ డిగ్రీ కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్టింగ్, సెమినార్/ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.nif.org.in ను సందర్శించండి

Original source: v6velugu.com
Read more on Kaizer News