Kaizer News

Mydukur: జెడ్పీ స్కూల్‌లో తెలుగు భాషా, జాతీయ క్రీడ

Mydukur: జెడ్పీ స్కూల్‌లో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు!

· National - India · hmtvlive.com

Mydukur: తెలుగు భాషా దినోత్సవాన్ని, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మైదుకూరు లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా కార్యక్రమం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోశెట్టి రామ్మోహన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు 163 వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం, ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు తెలుగు భాషలో ప్రావీణ్యత సాధించినప్పుడే ఇతర భాషల్లో కూడా పట్టు సాధిస్తారని, మాతృభాషపై మక్కువ పెంచుకోవాలని రామ మోహన్ సూచించారు. ప్రపంచ ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడలలో నైపుణ్యాన్ని సాధించాలని పేర్కొన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు చే కొనేయాడబడిన తెలుగు భాష అజరామరమైనదని, తెలుగు భాషను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగువారిపై ఉందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది కార్యదర్శి ఆవుల శ్రీనివాసులు, తెలుగు తెలుగు ఉపాధ్యాయుడు రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, తెలుగు ఉపాధ్యాయురాలు స్వర్ణలక్ష్మి, పాఠశాల క్రీడా ఉపాధ్యాయిని ఫాతిమా, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పద్మజ, ఏ రాముడు, నీరజ, మాధవిలత, స్వర్ణలత, రమాదేవి, నారాయణమ్మ, సుబ్బమ్మ, సురేంద్రనాయక్, ఆనందరావు, పద్మనాభం, రాజేంద్రప్రసాద్, బోధనేతర సిబ్బంది ప్రసాద్, తేజ, పరిమళ, అమరావతి, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా తెలుగు తల్లి, గిడుగు రామమూర్తి పంతులు, ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు.జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News