కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను దగా చేసిందని, ఇప్పటికే ఒక్కో దివ్యాంగుడికి రేవంత్‌రెడ్డి సర్కారు రూ.66 వేలు బాకీ పడిందని మాజీ మంత్రి, శాసనసభా పక్ష ఉప నేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఎల్బీనగర్‌లోని జీఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల సమర శంఖారావం సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని విమర్శించారు