Kaizer News

Chiru leaks Kaaka movie | ‘చిరు లీక్స్’ కంటిన్యూ..

Chiru leaks Kaaka movie | ‘చిరు లీక్స్’ కంటిన్యూ.. ‘కాకా’ మూవీలో మెగాస్టార్ పాత్ర పేరు అదేనట!

· Entertainment · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి తన ట్రేడ్‌మార్క్ స్టైల్‌లో మరోసారి ‘చిరు లీక్స్’ ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. బాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో అది సెన్సేషన్ అవుతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న మోస్ట్ అటెంటెడ్ మూవీ ‘కాకా’ సినిమాకు సంబంధించి మెగాస్టార్ స్వయంగా తన పాత్ర పేరును లీక్ చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేశారు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ నేమ్ ఏంటో చిరంజీవి రివీల్ చేయడంతో నెట్టింట ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ‘కాకా’ చిత్రంలో మెగాస్టార్ పాత్ర పేరు పూర్తి వివరాలను ఆయనే స్వయంగా బయటపెట్టారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు ‘కదిరి కాళిదాస్’ అని తేలిపోయింది. షార్ట్‌గా అందరూ పిలుచుకునేలా ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ తన చిత్రాల టైటిల్స్ లేదా పాత్రల పేర్లను సరదాగా లీక్ చేయడం మెగాస్టార్‌కు అలవాటే. ఇప్పుడు మరోసారి ఈ ‘చిరు లీక్స్’ ట్రెండ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘కాకా’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న మాస్ యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13 2027 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News