Hyderabad: మాజీ మంత్రి హరీష్ రావు దివ్యాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్న. వాళ్లు 2014, 2018 మేనిపెస్టోలో దివ్యాంగులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదు. పదేళ్లు వికలాంగుల హామీలను గాలికి వదిలేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు. వారి సంక్షేమాన్ని కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. 2023 మేనిపెస్టో లో దివ్యాంగుల అంశాన్ని మేనిపెస్టోలో కూడా చేర్చలేదు. దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం అన్నారు ఇచ్చారా..? ఏ ఒక్కటి అమలుకాలేదు. మీ హయాంలో ఏం చేశారో చెప్పడానికి ఏం లేక.. మాపై విమర్శలు చేస్తున్నారు. మేము వచ్చాక దివ్యాంగులకు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాహనాలు ఇచ్చాం. పుట్టుకతో అంగ వైకల్యంతో ఉన్న వారికి బాల్ భరోసా తో ఆదుకుంటున్నాం. వికలాంగులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం. మేము ప్రజలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీలను నెరవేరుస్తున్నాం. 2014, 2018, 2023 మ్యానిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పదేళ్ల పాటు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు ఎదురులేదన్నట్లుగా వ్యవహరించారు. దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి హరీశ్ రావు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకుని ఏకవచనంతో సంబోధిస్తూ విమర్శలు చేస్తున్నారు. దివ్యాంగులను బలవంతంగా సమావేశానికి పిలిపించుకుని విమర్శలు చేయించారు. హరీశ్ రావు విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దివ్యాంగులకు రూ.50 కోట్లతో వాహనాలు, బ్యాటరీ వెహికిల్స్‌తో పాటు ఇతర పరికరాలు అందించాం. వచ్చే ఏడాదిలో మరో రూ.50 కోట్లతో వాహనాలను అందిస్తాం. దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాం. కొత్తగా దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేస్తున్నాం. పూర్తి అంగవైకల్యంతో జన్మించే వాళ్లకు బాల్ భరోసా పథకం ద్వారా ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి వైద్యం అందిస్తోంది. ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం. వికలాంగుల ఆరు వేల పింఛన్లకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా పింఛన్ల పెంపు ఆలస్యం అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికలాంగుల సంక్షేమానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం. 2018, 2014 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టి అమలు చేయని వాటికి కేసీఆర్ సమాధానం చెప్పాలి. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి చెల్లిస్తామని బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి పక్కన పెట్టింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశారు. కొత్త యూనివర్సిటీలు నిర్మిస్తామని చెప్పారు. కనీసం ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేదు. తన పార్టీ నాయకుల ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చాడు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారు. చట్టసభల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస