Kaizer News

Nani The Paradise leaks | శ్రీకాంత్ ఓదెల ప్లానింగ్

Nani The Paradise leaks | శ్రీకాంత్ ఓదెల ప్లానింగ్.. నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్న సర్ప్రైజ్!

· Entertainment · prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి మాస్ సునామీ సృష్టించేందుకు నేచురల్ స్టార్ నాని సిద్ధమవుతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ . ‘దసరా’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల లీక్స్, అప్‌డేట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి వస్తున్న థర్డ్‌ సింగల్ సాంగ్‌కి సంబంధించిన చిన్నపాటి విశేషాలు, లీక్ బైట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాని స్వయంగా అనిరుధ్ స్టూడియో నుంచి ఈ సాంగ్ వైబ్స్ గురించి చిన్న హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఉత్సాహం డబుల్ అయింది. సినిమాలో ఈ మెలోడీ సాంగ్ విజువల్స్ పరంగానూ, ఆడియో పరంగానూ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో, సెట్స్ నుంచి కొన్ని లీక్స్ బయటకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. శ్రీకాంత్ ఓదెల రాసుకున్న పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ సీక్వెన్సులు, నాని డిఫరెంట్ గెటప్ తాలూకు చిన్నపాటి పిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో లీకై ట్రెండ్ అవుతున్నాయి. మేకర్స్ అధికారికంగా రివీల్ చేయకముందే ఈ లీక్స్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి

Original source: prabhanews.com
Read more on Kaizer News