Kaizer News

Narsapur: విష్ణు ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా

Narsapur: విష్ణు ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

· National - India · hmtvlive.com

నర్సాపూర్: ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు, హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను విష్ణు ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాఠశాలలో గత వారం రోజులుగా వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడా పోటీలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. నాగజ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో కీలకమని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, టీమ్‌ వర్క్ వంటి లక్షణాలను క్రీడలు పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. దీంతో విద్యార్థులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేష్, రమేష్తో పాటు ఇతర ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని పాఠశాల యాజమాన్యం అభినందించింది. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది

Original source: hmtvlive.com
Read more on Kaizer News