Kaizer News

Burning Topic: ప్రపంచ దేశాలను శాసిస్తున్న బ్రిక్స్

Burning Topic: ప్రపంచ దేశాలను శాసిస్తున్న బ్రిక్స్ దేశాలు!

· International · hmtvlive.com

Burning Topic: బ్రిక్స్ ...ఒక అంతర్జాతీయ కూటమి. ఈ కూటమి ఆవిర్భావానికి ఓ నేపథ్యం ఉంది. 2006 సెప్టెంబరులో న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చలు జరిగాయి. ఈ సమావేశాలకు బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. ఆ తరువాత ఈ నాలుగు దేశాల ప్రతినిధులు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2009 జూన్ 16న రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లో ఈ దేశాల ప్రతినిధుల పూర్తి స్థాయి దౌత్య సమావేశం జరిగింది. దీనినే బ్రిక్ కూటమి మొట్టమొదటి అధికారిక శిఖరాగ్ర సమావేశమని చెప్పుకోవచ్చు. అప్పటికి బ్రిక్స్ కూటమిలో దక్షిణాఫ్రికా చేరలేదు. కేవలం నాలుగుదేశాలతోనే బ్రిక్స్ కూటమి ప్రారంభమైంది.ఈ సదస్సుకు భారత్ తరఫున మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఆర్థిక సంస్థలను సంస్కరించడం వంటి మార్గాలపై కూటమి శిఖరాగ్ర సమావేశం దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా కొత్త గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అవసరాన్ని బ్రిక్‌ సమూహంలోని సభ్యదేశాలు ప్రకటించాయి. బ్రిక్స్ భౌగోళిక రాజకీయాల్లో కీలకమైన కూటమి. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా....ఈ కూటమిలో సభ్యదేశాలు. ఈ దేశాల తొలి అక్షరాలతో...బి, ఆర్‌, ఐ, సీ, ఎస్‌ తో ...కూటమికి బ్రిక్స్ అనే పేరు పెట్టుకున్నారు. ప్రాంతీయ ఆర్థిక వ్యవహారాలపై వాటికున్న పరపతికి బ్రిక్స్ సభ్యదేశాలు ప్రపంచమంతటా పేరు పొందాయి. 2009 నుంచి ప్రతి ఏడాది బ్రిక్స్ సభ్య దేశాల అధికారిక శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. 2018 నాటి లెక్కల ప్రకారం ఈ ఐదు దేశాల జీడీపీ 18.6 ట్రిలియన్ డాలర్లు. స్థూల ప్రపంచ ఉత్పత్తిలో ఇది 24 శాతం. కాగా2014లో 250 బిలియన్ డాలర్లతో బ్రిక్స్ దేశాలు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ పేరుతో ఒక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేశాయి. అభివృద్ది చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వడమే బ్రిక్స్ కూటమి లక్ష్యంగా మారింది. అయితే అప్పటివరకు బ్రిక్స్ కూటమిలో ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు సభ్యత్వం లేదు. అయితే 2014లో ఈ దేశాలకు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో సభ్యత్వం ఉండటం విశేషం. అంతర్జాతీయ సంస్థల విషయాన్ని కూడా బ్రిక్స్ సదస్సు గతంలోనే ప్రస్తావించింది. ఐక్యరాజ్యసమితితో పాటు భద్రతామండలిలో సమగ్ర సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని బ్రిక్స్ సదస్సు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితిని మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దాలని బ్రిక్స్ కూటమి అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు వర్థమాన దేశాలకు కూడా ప్రాతినిధ్యం దక్కేలా ఐక్యరాజ్యసమితిని తీర్చిదిద్దాలని బ్రిక్స్ జొహన్సెస్‌బర్గ్ సదస్సు అభిప్రాయపడింది. దీంతో పాటు సుస్థిరాభివృద్ది అజెండాను సమర్థంతంగా అమలు చేయాలని కోరింది. మొత్తంగా ప్రపంచ జనాభాలో 41 శాతానికి బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచ జీడీపీలో 24 శాతం వాటా కలిగి ఉన్నాయి. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి బ్రిక్స్ కూటమి దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. భవిష్యత్తులో బ్రిక్స్ కూటమి ఒక బలమైన వేదికగా మారుతుందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇదిలా ఉంటే,

Original source: hmtvlive.com
Read more on Kaizer News