నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన ఘోర విపత్తు హిమాలయ ప్రాంతాల్లో పెరుగుతున్న గ్లేసియర్ ప్రమాదాలపై ఆందోళనను పెంచుతోంది. గ్లేసియర్ కూలిపోవడంతో మంచు, రాళ్లు, మట్టి భారీగా కొండల నుంచి దిగువకు దూసుకొచ్చి నదీ లోయలను ముంచెత్తాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం. విపత్తు అనంతరం కొత్తగా నీటి మడుగులు ఏర్పడటం, మరోసారి వరదలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు హిమాలయ ప్రాంతాలపై పొంచి ఉన్న ముప్పును మరింత స్పష్టం చేస్తున్నాయి