Kaizer News

కొత్త బిజినెస్‌లోకి చిరంజీవి.. ప్రపంచ రికార్డ్‌ బద

కొత్త బిజినెస్‌లోకి చిరంజీవి.. ప్రపంచ రికార్డ్‌ బద్దలయ్యేలా ప్లాన్!

· City - Hyderabad · sakshi.com

మెగాస్టార్‌ చిరంజీవి కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు అత్యాధునిక మల్టీప్లెక్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి చిరంజీవి ఓ భారీ మల్టీప్లెక్స్‌ ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్‌ ఏషియన్‌ సునీల్‌తో కలిసి హైదరాబాద్‌లో ఈ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్‌ తెరను ఏర్పాటు చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే పలువురి హీరోలతో.. ఇప్పటికే మహేశ్‌బాబుతో ఏఎంబీ సినిమాస్‌, అల్లు అర్జున్‌తో ఏఏఏ సినిమాస్‌, రవితేజతో ఏఆర్‌టీ సినిమాస్‌, విజయ్‌ దేవరకొండతో ఏవీడీ సినిమాస్‌ వంటి మల్టీప్లెక్స్‌ ప్రాజెక్టులను ఏషియన్‌ సునీల్‌ తీసుకొచ్చారు. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవితో మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారనే వార్త ఆసక్తి రేపుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తయితే హైదరాబాద్‌లో మరో అత్యాధునిక మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. చిరంజీవి–ఏషియన్‌ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: పాండా అంటూ ట్రోలింగ్‌.. బిగ్‌బాస్‌ వినాయకుడు ఎలిమినేట్‌..? కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు) ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు) గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఈడీ స్పష్టీకరణ తిరుపతిలో దారుణం.. సీటు కోసం కొట్టుకున్న మహిళలు తోటలో అసలు ఏం జరిగింది..? రిపోర్టులో బయటపడ్డ సంచలన నిజాలు నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని

Original source: sakshi.com
Read more on Kaizer News