Kaizer News

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో భారత్‌ బోణీ

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో భారత్‌ బోణీ

· National - India · sakshi.com

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో భాగంగా ఆదివారం టీ20 మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై భారత్‌ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన థాయ్‌లాండ్ వుమెన్స్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. ఇక భార‌త్ త‌ర‌ఫున ప్ర‌తీక్ రావ‌ల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సంద‌ర్భంగా కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్ర‌తీక రావ‌ల్ క్యాప్‌ను అందుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త బ్యాటర్లలో షఫాలీ వర్మ 36 బంతుల్లోనే 64 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా ప్రతీకా రావల్ పరుగులతో రాణించింది. భార‌త్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. థాయ్‌లాండ్ బౌలర్లలో సులీపోర్న్ లావోమి 3 వికెట్లు తీయగా, సునిదా చతురోంగ్రత్తనా 2 వికెట్లతో రాణించింది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన థాయ్‌లాండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. థాయ్‌లాండ్ బ్యాటర్లలో కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగారు. నన్నపట్ కొంచరోయెంకై(వికెట్ కీప‌ర్‌) మాత్రమే 41 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భార‌త బౌలర్లలో నందినీ శర్మ, దీప్తి శర్మ చెరో మూడు వికెట్లు తీయగా, శ్రీ చరణి రెండు వికెట్లు, క్రాంతి గౌడ్‌ ఒక వికెట్టు తీశారు. టాస్‌ అనంతరం హర్మన్‌ మాట్లాడుతూ.. ఒక‌వేళ తాము టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునేవాళ్ల‌మ‌ని హ‌ర్మ‌న్ తెలిపింది. దుబాయ్‌లో త‌మ‌కు ఇదే తొలి మ్యాచ్ అని పేర్కొన్న హ‌ర్మ‌న్‌, మ్యాచ్‌లో బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని తెలిపింది. జెమీమా అందుబాటులో లేక‌పోవ‌డంతోనే ప్ర‌తీక రావ‌ల్‌కు అవ‌కాశం వ‌చ్చింద‌ని హ‌ర్మ‌న్ తెలిపింది. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News