Kaizer News

భీమ్‌గల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

భీమ్‌గల్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

· National - India · prabhanews.com

మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులు.. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచన భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని భీమ్‌గల్‌లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి స్వామి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ భారత హాకీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప క్రీడాకారుడని ఉపాధ్యాయులు కొనియాడారు. ఆయన అద్భుతమైన హాకీ నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని, భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ధ్యాన్‌చంద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి చేరాలని పాఠశాల భౌతిక విద్యా ఉపాధ్యాయుడు సదమస్తుల రమణ సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘువాస్, రాజ్‌కుమార్, వినోద్‌కుమార్, రాములు, వాసుదేవ్, శివకుమార్, వినోద్ సాగర్, భూమేశ్వర్, ఇమాన్యుల్, ఈశ్వర్ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News