Kaizer News

Malkajgiri: మల్కాజిగిరి వెంకటేశ్వరనగర్‌లో వైభవంగా

Malkajgiri: మల్కాజిగిరి వెంకటేశ్వరనగర్‌లో వైభవంగా వినాయక ఉత్సవాలు!

· City - Hyderabad · hmtvlive.com

Shorts Malkajgiri: మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ వెంకటేశ్వరనగర్ కాలనీలో వివేకానంద ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కాంగ్రెస్ బి-బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్,బీకే శ్రీనివాస్,మౌలాలి కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు శివ యాదవ్,బ్రహ్మయ్య, రోజా రమణి, అంజయ్య యాదవ్,సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News