Kaizer News

Walnut harvesting | సంప్రదాయ పద్దతిలో వాల్‌నట్స్‌

Walnut harvesting | సంప్రదాయ పద్దతిలో వాల్‌నట్స్‌ సాగు షురూ.. వీడియో

· National - India · ntnews.com

Walnut harvesting | ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల్లో టాప్‌లో ఉంటాయి వాల్‌నట్స్‌. ఎంతో ప్రాముఖ్యత కలిగిన, విలువైన ఆహారంగా పరిగణించే వాల్‌నట్స్‌ సాగు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. తెలుగులో కొండగొనుగు పిక్కగా పిలుచుకునే వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాగా జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో ఏటా మాదిరిగానే ఈ సారి కూడా వాల్‌నట్స్‌ సాగు మొదలైంది. సహజసిద్ద వ్యవసాయంలో భాగంగా స్థానిక రైతులు సంప్రదాయ పద్దతుల్లో ఈ వాల్‌నట్స్‌ను సాగు చేస్తారు. స్థానిక రైతు మాండవ్‌ మాట్లాడుతూ.. హార్టికల్చర్‌ ఫీల్డ్‌లో నేను 30 ఏండ్లుగా పని చేస్తున్నా. మా ఆదాయం రోజురోజుకూ పెరుగుతుంది. రైతులు ఎక్కువగా హార్టికల్చర్‌పై ఫోకస్ పెట్టి వారి ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రధాని సందేశాన్ని ఇచ్చారు. పెద్దవాళ్లు కేవలం మొక్కజొన్నను మాత్రమే సాగు చేసేవారు. కానీ అందులో లాభమంతగా ఉండదు.. కొన్నిసార్లు 30 వేల రూపాయలు, ఇంకొన్ని సార్లు రూ.40 వేలు, మరికొన్నిసార్లు రూ.50 వేలు దిగుబడి వస్తుంది. టీవీలో వచ్చే ప్రధాని మన్‌ కీ బాత్‌ ప్రోగ్రాం నుంచి చాలా స్పూర్తి పొందాం. ఆయన చెప్పేది విని మా ఆదాయాన్ని పెంచుకునేలా ఈ సాగుపై శ్రద్ద పెట్టేలా మాకు స్పూర్తి కలిగించింది. హార్టికల్చర్‌ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు స్థానికులే. వాళ్లు మా దగ్గరకు వచ్చి ప్రతీ దశలో మమ్మల్ని గైడ్‌ చేస్తుంటారు. ఏ సమస్య వచ్చినా వాళ్లు పరిష్కరిస్తుంటారు. నేను సులేమాన్‌, హందాన్‌ రకాలను సాగు చేస్తున్నా. వాల్‌నట్స్‌ రుచి గొప్పగా ఉంటుంది. వాల్‌నట్స్‌ను సులభంగా చేతితో పగులగొడతాం. కొన్నిసార్లు అవి చెట్లు నుండి కింద పడేటప్పుడు పగిలిపోతుంటాయని చెప్పుకొచ్చాడు

Original source: ntnews.com
Read more on Kaizer News